

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ బలమైన వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 2026లో రాష్ట్ర డొమెస్టిక్ జీఎస్టీ రెవెన్యూ 18 శాతం వృద్ధితో రూ.5,327 కోట్లకు చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి అందిన పోస్ట్-సెటిల్మెంట్ ఎస్జీఎస్టీ రెవెన్యూ రూ.22,231 కోట్లుగా నమోదైంది. ఇది కూడా 18 శాతం వృద్ధిని చూపించింది. తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్లోనూ జీఎస్టీ వసూళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. సెప్టెంబర్లో రాష్ట్ర డొమెస్టిక్ జీఎస్టీ రెవెన్యూ రూ.3,599 కోట్లుగా నమోదై 6 శాతం వృద్ధిని సాధించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య ఏపీకి అందిన పోస్ట్-సెటిల్మెంట్ ఎస్జీఎస్టీ రెవెన్యూ రూ.19,598 కోట్లుగా ఉంది. ఈ కాలంలో 18 శాతం వృద్ధి నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పన్ను ఆదాయాలు వృద్ధి బాటలో ఉన్నట్లు తాజా జీఎస్టీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!