14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు

Writer: Nithish 08:22 AM, 14 అక్టోబర్, 2026
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు

వాట్సాప్ ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకునే ‘సెండ్‌ లేటర్‌’ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన బీటా యూజర్లతో పరీక్షిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా యూజర్లు టెక్స్ట్ సందేశాలు, వెబ్‌సైట్ లింకులు, ఫొటోలు, వీడియోలను ముందుగానే సిద్ధం చేసి, తమకు కావాల్సిన సమయంలో ఆటోమేటిక్‌గా పంపేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్‌ చాట్‌లలోనూ ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నిర్ణీత సమయానికి సందేశాలు పంపేందుకు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.

షెడ్యూల్ చేసిన సందేశాలను పంపే ముందు యూజర్లు పరిశీలించుకోవడంతో పాటు, అవసరం లేదనుకుంటే వాటిని తొలగించుకునే సదుపాయం కూడా ఉండనుంది. షెడ్యూల్ చేసిన సందేశాన్ని తొలగించినప్పుడు, దాని గురించి అవతలి వ్యక్తికి నోటిఫికేషన్ వెళ్లదని సమాచారం. సందేశాల భద్రతకు వాట్సాప్‌ ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం కూడా వర్తించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లోని ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. సాధారణ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెమీకండక్టర్ల తయారీలో భారత్ కీలక కేంద్రంగా ఎదుగుతుంది: చంద్రశేఖరన్

సెమీకండక్టర్ల తయారీలో భారత్ కీలక కేంద్రంగా ఎదుగుతుంది: చంద్రశేఖరన్

యూపీఐ ఛార్జీల అమలు వాయిదా.. ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం

యూపీఐ ఛార్జీల అమలు వాయిదా.. ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం

సెమీకండక్టర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులే కీలకం - ఎన్ చంద్రశేఖరన్

సెమీకండక్టర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులే కీలకం - ఎన్ చంద్రశేఖరన్

జోహోలో వేతనాల పెంపునకు బ్రేక్.. శ్రీధర్ వెంబు కీలక ప్రకటన

జోహోలో వేతనాల పెంపునకు బ్రేక్.. శ్రీధర్ వెంబు కీలక ప్రకటన

ఎల్నినో ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న ధరలు!
ట్యాగ్లు
వాట్సాప్వాట్సాప్ కొత్త ఫీచర్సెండ్ లేటర్మెసేజ్ షెడ్యూలింగ్ఆండ్రాయిడ్ యూజర్లువాట్సాప్ బీటాడిజిటల్ టెక్నాలజీగ్రూప్ చాట్మెసేజ్ ఎన్‌క్రిప్షన్టెక్నాలజీ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఎల్నినో ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న ధరలు!

భారత్‌లో స్టార్‌లింక్‌పై కేంద్రం ఆందోళన.. జాతీయ భద్రతపై ప్రత్యేక దృష్టి!

భారత్‌లో స్టార్‌లింక్‌పై కేంద్రం ఆందోళన.. జాతీయ భద్రతపై ప్రత్యేక దృష్టి!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు విజయవాడలో రాష్ట్రపతి ముర్ము పర్యటన
జనరల్

నేడు విజయవాడలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

పదవీ విరమణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు...ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు
బిజినెస్

పదవీ విరమణ నుంచి ఆరోగ్య రక్షణ వరకు...ఎల్‌ఐసీ కొత్త ప్లాన్లు

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం
క్రీడలు

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ ఘన విజయం

భారత ఆర్థిక పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయి - నిర్మలా  సీతారామన్
బిజినెస్

భారత ఆర్థిక పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయి - నిర్మలా సీతారామన్

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
రాజకీయాలు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఐటీ రంగంలో ఏఐ సేవలకు భారీ డిమాండ్
బిజినెస్

ఐటీ రంగంలో ఏఐ సేవలకు భారీ డిమాండ్

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..
జనరల్

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..

మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్.. నేడు కీలక నేతలతో భేటీ
రాజకీయాలు

మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్.. నేడు కీలక నేతలతో భేటీ

ఈ సమస్యలు ఉన్నవారు లెమన్ టీకి దూరంగా ఉండాలి.. వైద్యుల సూచన
ఆరోగ్యం

ఈ సమస్యలు ఉన్నవారు లెమన్ టీకి దూరంగా ఉండాలి.. వైద్యుల సూచన

కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే 4 ఆహారాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఆరోగ్యం

కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపే 4 ఆహారాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు
క్రీడలు

బవుమాకు తొలి టెస్టు ఓటమి.. చెక్కుచెదరని ప్రపంచ రికార్డు

ఉప్పల్ టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం.. బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసుల చర్యలు
క్రీడలు

ఉప్పల్ టీ20 మ్యాచ్ టికెట్ల వివాదం.. బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసుల చర్యలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు
బిజినెస్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి
జనరల్

రష్యా డీజిల్ ఒప్పందంపై ట్రంప్ వివరణ.. ప్రపంచ మార్కెట్ల కోసమేనని వెల్లడి

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం
జనరల్

శ్రీసిటీలో తయారైన డ్రైవర్‌ రహిత రైళ్లు.. చెన్నై మెట్రోలో సేవలు ప్రారంభం