
జనరల్

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఏర్పాట్ల కోసం రూ.1000 కోట్లకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.300 కోట్లకు పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అల్పాహారం, పాలు అందించే నిర్ణయాలకు ఆమోదం లభించింది. అలాగే అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లాను ఎంపిక చేశారు. కేసముద్రం ఫైర్స్టేషన్కు 18 పోస్టుల మంజూరుకు కూడా కేబినెట్ అంగీకరించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!