

అమెరికా పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ శ్వేతసౌధంలోని ఈస్ట్ రూమ్‌లో అధికారిక విందు ఇచ్చారు. జిన్‌పింగ్ కోసం అమెరికా రుచులకు చైనా వంటకాల ప్రభావాన్ని జోడిస్తూ ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. ఇందులో పసుపు గుమ్మడి సూప్, అడవి పుట్టగొడుగుల వంటకం, క్రిస్పీ పాన్‌సెట్టా, నువ్వులతో తయారు చేసిన సీ బాస్, బేబీ బాక్ చోయ్, రోస్టెడ్ గార్డెన్ ఎగ్‌ప్లాంట్ వంటి వంటకాలు ఉన్నాయి. డెజర్ట్‌గా వెనీలా క్రిమెక్స్, చెర్రీ కాన్‌ఫిట్, వాల్‌నట్ ఫ్రాంగీపేన్, వైట్‌హౌస్ తేనెతో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌ను అందించారు.
ఈ సందర్భంగా ట్రంప్.. జిన్‌పింగ్‌కు అమెరికా జాతీయ చిహ్నమైన బాల్డ్ ఈగల్ విగ్రహాన్ని కానుకగా అందించారు. సుమారు మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని విందులో అతిథుల సమక్షంలో ప్రదర్శించారు. అనంతరం శ్వేతసౌధంలో నిర్మాణంలో ఉన్న బాల్‌రూమ్‌ను జిన్‌పింగ్‌కు చూపించారు. ఈ విందుకు టెక్ రంగానికి చెందిన ఎలాన్ మస్క్, టిమ్ కుక్, జెన్సెన్ హువాంగ్, శామ్ ఆల్ట్‌మన్‌తో పాటు జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్, మార్క్ జుకర్‌బర్గ్, సత్య నాదెళ్ల తదితర ప్రముఖులు హాజరయ్యారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!