
సినిమాలు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులకు సంబంధించి ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తయింది. ఇప్పటివరకు సీబీఐ దాఖలు చేసిన ఆరు ఛార్జిషీట్లకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తాజాగా భారతీ సిమెంట్స్ కేసులో డిశ్చార్జి పిటిషన్ల విచారణ ప్రారంభమైంది. సీబీఐతో పాటు ఈడీ కేసుల్లోనూ న్యాయస్థానంలో రోజువారీ విచారణ కొనసాగుతోంది.
సీబీఐ కోర్టులో ఇప్పటివరకు మొత్తం 45 డిశ్చార్జి పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి, బీపీ ఆచార్య, అయోధ్యరామిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై కూడా వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లన్నింటిపై సీబీఐ కోర్టు ఒకేసారి ఆదేశాలు వెలువరించనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!