

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎలిమినేషన్ సమీకరణాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రేక్షకుల ఓటింగ్‌తో పాటు హౌస్‌లో కంటెస్టెంట్ల వ్యూహాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తక్కువ ఓట్లు రావడంతో సుధీర్ ఎలిమినేషన్‌కు సిద్ధమైనట్లు చూపించిన బిగ్‌బాస్.. చివరి నిమిషంలో ముకేష్ తన దగ్గరున్న సూపర్ పవర్‌ను ఉపయోగించి అతడిని సేవ్ చేసినట్లు సమాచారం. గతంలో వర్షిణి, వంశీలను కూడా ఇదే విధంగా కాపాడిన ముకేష్.. మరోసారి తన పవర్‌తో సుధీర్‌కు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఝాన్సీ దగ్గరున్న సేవింగ్ పవర్‌ను కూడా తన వ్యూహంతో ఉపయోగించేలా చేసి, ఆమెకు ఉన్న అవకాశాన్ని దూరం చేసినట్లు ప్రచారం సాగుతోంది.
ఝాన్సీ తన దగ్గరే ఆ పవర్‌ను ఉంచుకుని ఉంటే ఎలిమినేషన్ నుంచి తనను తాను కాపాడుకునే అవకాశం ఉండేదనే చర్చ నడుస్తోంది. సుధీర్‌ను సేవ్ చేసే క్రమంలో ఆమె ఆ అవకాశాన్ని కోల్పోవడంతో ఇప్పుడు ఝాన్సీకి ఎలిమినేషన్ ముప్పు ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి గోట్ గ్రూప్‌లో చోటు సంపాదించుకుని ఎలిమినేషన్ నుంచి బయటపడినట్లు సమాచారం. ఇక రోహిత్, రామకృష్ణలకు సమాన ఓట్లు రావడంతో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అల్టిమేట్ గోట్ త్రిగుణ్‌కు కీలక నిర్ణయాధికారం ఇస్తే, తనకు పోటీగా భావించే రోహిత్‌ను ఎలిమినేట్ చేసే అవకాశం ఉందనే చర్చ వినిపిస్తోంది. తాజా ప్రచారం ప్రకారం ఎనిమిదో వారం ఝాన్సీ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!