

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించారు. అక్టోబర్ 30న వివాహం జరిగినట్లు పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు పోస్టు చేశారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరి వివాహం జరిగినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వార్తా కథనాలు వెల్లడించాయి. దిల్లీ, శ్రీనగర్‌లో జరిగిన వేడుకలకు ఇరు కుటుంబాల సభ్యులు హాజరైనట్లు సమాచారం.
ఒమర్ అబ్దుల్లా, పాయల్ అబ్దుల్లాల వివాహం 1994లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో భార్యతో విడిపోతున్నట్లు ఒమర్ ప్రకటించగా, అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. తొలుత కుటుంబ న్యాయస్థానం, ఆ తర్వాత దిల్లీ హైకోర్టు విడాకుల పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జులైలో ఇరువురి మధ్య మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారం కావడంతో సుప్రీంకోర్టు విడాకులకు ఆమోదం తెలిపింది. ఆ పరిణామం జరిగిన మూడు నెలలకే ఒమర్ తన కొత్త జీవితాన్ని ప్రకటించడం చర్చనీయాంశమైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!