
సినిమాలు

అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్, నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల చిత్తూరు ప్రాంతంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన తాతయ్య, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి జన్మించిన నేలతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. చిత్తూరులో అపోలో విద్యాసంస్థల ద్వారా 5,900 మంది విద్యను అభ్యసిస్తుండటం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
త్వరలోనే చిత్తూరు ప్రాంతంలోని అర్ధగిరి ఆలయంలో ‘రామ రక్షా’ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఉపాసన వెల్లడించారు. ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలను వివరిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!