

తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించారంటూ జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం ఎలాంటి క్రాప్ హాలిడే ప్రకటించలేదని వెల్లడించారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సూచించారు. ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న విపత్తు అని పేర్కొన్న మంత్రి.. దాని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రాయితీపై అందిస్తున్నామని తుమ్మల వివరించారు. గత ఆరు నెలలుగా ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకునేలా సూచనలు ఇస్తున్నామని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!