

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36,351 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 4,372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు కల్పించనున్నారు.
ఎన్నికల భద్రతలో భాగంగా 671 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మరో 1,233 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసు బలగాలను మోహరించనున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఎన్నికల విధుల కోసం 1,543 రూట్ మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 111 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 4,655 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు. ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో ఇప్పటికే 107 మందిని అరెస్ట్ చేశారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!