

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయినట్లు వచ్చిన వార్తలు ప్రేక్షకుల్లో చర్చకు దారితీశాయి. అగ్నిపరీక్ష పోటీలో జడ్జిలను మెప్పించి హౌస్‌లోకి అడుగుపెట్టిన రోహిత్‌కు ప్రారంభంలో మంచి గుర్తింపు లభించింది. పలువురు సెలబ్రిటీలు అతడిని నామినేట్ చేయడంతో సోషల్ మీడియాలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా, టైటిల్ రేసులో ఉండే వ్యక్తిగా చర్చ జరిగింది. అయితే హౌస్‌లో గేమ్స్ పరంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గొడవల్లో కనిపించినప్పటికీ, టాస్కుల్లో తన సత్తా నిరూపించుకోలేకపోయాడని కొందరు ప్రేక్షకులు విశ్లేషిస్తున్నారు.
రోహిత్ ఎలిమినేషన్‌కు పలు అంశాలు కారణమై ఉండవచ్చని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. టాస్కుల్లో సరిగా ఆడకపోవడం, ఓవర్ యాటిట్యూడ్ ప్రదర్శించడం, తోటి కంటెస్టెంట్లతో గొడవలు, మాటతీరు, బిగ్‌బాస్‌తో పాటు హోస్ట్ నాగార్జున హెచ్చరించినా ప్రవర్తనలో మార్పు రాకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. షాలినితో గేమ్‌కు మించి సన్నిహితంగా ఉండటం, త్రిగుణ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టి తన ఆటను పట్టించుకోకపోవడం కూడా ప్రతికూలంగా మారాయని చర్చించుకుంటున్నారు. ఇక రోహిత్‌కు వారానికి రూ.70 వేల చొప్పున ఎనిమిది వారాలకు రూ.5.60 లక్షలు, అగ్నిపరీక్షలో పాల్గొన్నందుకు మరో రూ.50 వేలు కలిపి మొత్తం రూ.6.10 లక్షల పారితోషికం లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎలిమినేషన్ సమయంలో తనకు కేటాయించిన ఏవీని ఉపయోగించకపోవడంతో రీఎంట్రీ ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పారితోషికం, రీఎంట్రీపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!