

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు మంజూరు చేసే ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేస్తోంది. ప్రభుత్వ పింఛన్లు, రాయితీలు, వివిధ సంక్షేమ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్లు కీలకంగా ఉంటాయి. వైద్య పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా సోమవారం నుంచి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నారు. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి 70 వేలకు పైగా స్లాట్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. గతంలో జూలైలో స్లాట్లు అందుబాటులోకి వచ్చిన రెండు రోజుల్లోనే పూర్తిగా బుక్ కావడంతో చాలామందికి అవకాశం దక్కలేదు. ఈసారి అర్హులు తమ సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలు, ఏపీ సేవా పోర్టల్ లేదా మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో సహాయం చేసేందుకు డిజిటల్ సహాయకులు కూడా అందుబాటులో ఉంటారు.
స్లాట్ బుకింగ్ సమయంలో దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను సమర్పించాలి. వైకల్య వివరాలతో కూడిన స్వీయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో పాటు పుట్టుమచ్చల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియలో అక్రమాలకు తావులేకుండా ఈ నిబంధనలు అమలు చేయనున్నారు. ఈసారి రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించకుండా జోన్ల వారీగా స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం వైద్యులు పరీక్షలు నిర్వహించి, వైకల్య శాతాన్ని నిర్ధారించిన అనంతరం అర్హులకు అధికారిక సదరం ధ్రువపత్రాలు జారీ చేస్తారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!