
సినిమాలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
కేసు దర్యాప్తులో భాగంగా మూడు జిల్లాల్లోని మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!