
ఓటీటీ

నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో రూ.440 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం నవంబర్ 27 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు, మరోసారి వీక్షించాలనుకునే అభిమానులు ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డాక్టర్ విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అత్యంత తక్కువ బడ్జెట్‌తో నిర్మించారు. హిందీతో పాటు తెలుగు భాషలోనూ ఈ సినిమా ఒకేసారి డిజిటల్ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ఈ ఆధ్యాత్మిక చిత్రం ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. నవంబర్ 27 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!