
సినిమాలు

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కింగ్’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘తూ మిల్ జాయే’ సోషల్ మీడియాలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ పాటలో దీపికా పదుకొణె ధరించిన కాషాయ రంగు దుస్తులే వివాదానికి ప్రధాన కారణంగా నిలిచాయి.
దీపికా కాషాయ దుస్తులపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ పాట చుట్టూ చర్చ మొదలైంది. దీంతో సంగీతం, నటీనటుల ప్రదర్శనకే పరిమితం కావాల్సిన పాట వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ‘కింగ్’ సినిమాకు ఈ పరిణామం మరింత ప్రచారం తీసుకొచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!