
జనరల్

విశాఖపట్నంలోని నేవీ డాక్‌యార్డ్‌లో యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కేసరి ప్రమాదానికి గురైంది. నౌక ముందుభాగం కొంత మేర నీటిలో మునిగిపోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. రక్షణ, సహాయక చర్యలు చేపట్టి నౌకలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో నేవీ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం.
ఇటీవలే ఐఎన్‌ఎస్ కేసరి మరమ్మతులు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో తిరిగి సముద్ర ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌక ముందుభాగం నీటిలోకి ఎందుకు మునిగిందనే విషయంపై అధికారులు దృష్టి సారించారు. ప్రమాదానికి గల కారణాలు, నౌకకు జరిగిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!