

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా ముంబైలో నిర్వహించిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ముందస్తు అనుమతి లేకుండా ఆగస్ట్ క్రాంతి మైదాన్‌తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనలు చేపట్టడంతో పోలీసులు 400 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసనల్లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు.
దేశ రాజధానిలో కొనసాగుతున్న సీజేపీ ఆందోళనకు సంఘీభావంగా ముంబైలో ఈ నిరసనలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ నేతృత్వంలోని ‘హమ్ భారత్ కే లోగ్’ సంస్థ సభ్యులు, సీపీఐ(ఎం) కార్యకర్తలు సహా దాదాపు 200 మందిని పోలీసులు అదే ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) కార్యకర్తలు దక్షిణ ముంబైలోని హుతాత్మా చౌక్ వద్ద సీజేపీకి మద్దతుగా నిరసన తెలిపారు. అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహించిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!