
జనరల్

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు అరుదైన గౌరవం లభించింది. దేశ భద్రత, ఇంటెలిజెన్స్ రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక లోక్‌మాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా అజిత్ దోవల్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా అజిత్ దోవల్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను యువత ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా వ్యవహరించడం కాదని, దానితో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. నిరసన తెలిపే హక్కు చట్టపరమైన పరిధిలో ఉండాలని, ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!