
షోస్

ప్రధాని నరేంద్ర మోదీని ఆయన మాతృమూర్తి, దివంగత హీరాబెన్ ఆశీర్వదిస్తున్నట్లుగా కాశీకి చెందిన ఓ కళాకారుడు రూపొందించిన ప్రత్యేక హస్తకళా చిత్రం ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బహుమతిగా ఇచ్చేందుకు ఈ కళాకృతిని సిద్ధం చేశారు. శ్రీరాముడి కాలం నాటిదిగా చెబుతున్న ‘ఉచంద్ కళ’ స్ఫూర్తితో పట్టుదారాలను ఉపయోగించి ఈ చిత్రాన్ని రూపొందించారు.
కళాకారుడు సర్వేశ్‌కుమార్ శ్రీవాస్తవ మరో ఇద్దరు కళాకారులతో కలిసి సుమారు నెలన్నర పాటు శ్రమించి ఈ ప్రత్యేక కళాకృతిని పూర్తి చేశారు. మోదీకి గతంలోనూ శ్రీవాస్తవ పలు కళాకృతులను బహుమతులుగా పంపించారు. అయోధ్య రామమందిరం, క్రికెట్ ప్రపంచ కప్ వంటి అంశాల ఆధారంగా ప్రత్యేక డిజైన్లతో కూడిన చీరలను కూడా ఆయన రూపొందించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!