
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అత్యంత ఆకర్షణీయమైన నిర్మాణ శైలితో రూపుదిద్దుకుంటున్న ఈ టవర్లు భవిష్యత్తులో నవ్యాంధ్ర పరిపాలనకు కీలక కేంద్రంగా నిలవనున్నాయి. అమరావతి స్కైలైన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా వీటిని ఆధునిక ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.
ఈ ఐకానిక్ టవర్ల ప్రధాన ప్రత్యేకతల్లో డయాగ్రిడ్ టెక్నాలజీ ఒకటి. భవనాల వెలుపల ప్రత్యేకమైన గ్రిడ్ ఆకృతిని అందించడంతో పాటు నిర్మాణానికి అవసరమైన బలాన్ని కల్పించేలా ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. సీఆర్డీఏ ఈ టవర్ల నిర్మాణాన్ని 2028 దసరా నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, టవర్ల నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటన్న అంశాలపై ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!