3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

Writer: Pooja 11:01 AM, 3 సెప్టెంబర్, 2026
క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలతో పాటు తాజాగా సురేఖ చేసిన వ్యాఖ్యలను కూడా అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సురేఖపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేబినెట్‌ నుంచి తొలగించే అవకాశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఆమె హద్దులు దాటారని, కఠిన చర్యలు తప్పవని ఏఐసీసీకి చెందిన కీలక నేత ఒకరు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే సురేఖపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేలా కొందరు ముఖ్య నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

బుధవారం రోజంతా కాంగ్రెస్‌ పార్టీలో వరుస సమావేశాలు, సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. గత రాత్రి సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో కలిసి సమావేశమయ్యారు. అనంతరం ముగ్గురూ ఒకే కారులో రాజశేఖర్‌ రెడ్డి అవార్డు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భట్టి విక్రమార్క ఖర్గే కారులోనే ఆయన నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఖర్గేతో విడిగా సమావేశమయ్యారు. అనంతరం మీనాక్షి నటరాజన్‌తోనూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం.

ఈ రోజు కూడా కాంగ్రెస్‌ నేతల మధ్య చర్చలు కొనసాగనున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. కేసీ వేణుగోపాల్‌ ఈ రోజు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గేతో భేటీ కానున్నట్లు సమాచారం. మొత్తం పరిణామాలపై నివేదికను సిద్ధం చేసి రాహుల్‌ గాంధీకి వివరించనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు, సమయాన్ని బట్టి సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ కూడా రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.

కొండా సురేఖపై చర్యలతో పాటు మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రుల పనితీరు, సమర్థత ఆధారంగా కేబినెట్‌ ప్రక్షాళనకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి కోరినట్లు సమాచారం. కేబినెట్‌ మార్పులు, చేర్పులతో పాటు నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, గవర్నర్‌ కోటా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, లేక సమావేశాల తర్వాత చేపడతారా అనే అంశంపై రాహుల్‌ గాంధీతో జరిగే సమావేశాల అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

ట్యాగ్లు
కొండా సురేఖకాంగ్రెస్ అధిష్ఠానంరేవంత్ రెడ్డిభట్టి విక్రమార్కతెలంగాణ రాజకీయాలుమంత్రివర్గ ప్రక్షాళన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా దంపతుల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతుల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం
జనరల్

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?
జనరల్

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!
జనరల్

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు
జనరల్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..
ఓటీటీ

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ
సినిమాలు

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ
సినిమాలు

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?
సినిమాలు

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌
ఓటీటీ

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!
జనరల్

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!