6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్!

Writer: Chandrika 10:43 AM, 6 నవంబర్, 2026
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్!

ఆంధ్రప్రదేశ్‌లో కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ (మోకా) సైట్ క్లియరెన్స్ మంజూరు చేసింది. దీంతో ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన తదుపరి చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూములను గుర్తించింది. నిర్మాణానికి అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వానికి పూర్తి యాజమాన్య హక్కులు ఉండే ల్యాండ్‌లార్డ్‌ విధానంలో చేపట్టాలా? లేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని అనుసరించాలా? అనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మోకాకు సమాచారం అందించి, ఆసక్తి వ్యక్తీకరణకు సంబంధించిన ఆర్‌ఎఫ్‌పీ జారీ చేయనున్నట్లు ఏపీఏడీసీఎల్‌ ఉన్నతాధికారి వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు, అనంతపురం, అమరావతి, దగదర్తిలో మొత్తం తొమ్మిది విమానాశ్రయాలను రూ.6,418 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు తాజాగా సైట్ క్లియరెన్స్ లభించింది. శ్రీకాకుళం విమానాశ్రయం మొదటి దశకు రూ.750.52 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, 1,185.56 ఎకరాల్లో ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. 2030 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఏఐ, ప్రైవేటు భాగస్వామ్యం, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేదా పూర్తిగా ఏఏఐ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసే మార్గాలను పరిశీలిస్తున్నారు. కుప్పం విమానాశ్రయం మొదటి దశకు రూ.734 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 1,788 ఎకరాలను గుర్తించగా, ఇప్పటికే 1,300 ఎకరాలు సేకరించారు. భూసేకరణకు రూ.198.75 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.146 కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండు దశల్లో కలిపి ఈ విమానాశ్రయ అభివృద్ధికి రూ.1,142.10 కోట్లు వెచ్చించేలా ప్రతిపాదనలు రూపొందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఐటీ శాఖ చర్యలు

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఐటీ శాఖ చర్యలు

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి

ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

మురసు తుఫాను బీభత్సం.. ఏపీలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం

మురసు తుఫాను బీభత్సం.. ఏపీలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్కుప్పం విమానాశ్రయంశ్రీకాకుళం విమానాశ్రయంవిమానాశ్రయాల అభివృద్ధికేంద్ర పౌర విమానయాన శాఖమోకాఏపీఏడీసీఎల్అమరావతిమౌలిక సదుపాయాలువిమానాశ్రయ ప్రాజెక్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈఎంఐల ఆకర్షణలో పడితే ఆర్థిక స్వేచ్ఛకు ముప్పే.. అనవసర అప్పులతో జాగ్రత్త!
బిజినెస్

ఈఎంఐల ఆకర్షణలో పడితే ఆర్థిక స్వేచ్ఛకు ముప్పే.. అనవసర అప్పులతో జాగ్రత్త!

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఐటీ శాఖ చర్యలు
జనరల్

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఐటీ శాఖ చర్యలు

ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో 67.24 శాతం పోలింగ్ నమోదు
రాజకీయాలు

ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో 67.24 శాతం పోలింగ్ నమోదు

ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు..
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు..

హుజూర్‌నగర్‌లో పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

హుజూర్‌నగర్‌లో పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు
జనరల్

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్!
జనరల్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్!

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కొనుగోలుకు ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
బిజినెస్

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కొనుగోలుకు ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!
క్రీడలు

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..
జనరల్

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి
జనరల్

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..
రాజకీయాలు

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!