
బిజినెస్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదుకాగా, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో రెండేసి కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తాజాగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ వేరియంట్ వల్ల గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, ప్రస్తుతం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో కూడా ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!