

అమరావతిలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. బాధిత డిపాజిటర్లకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్‌కు చెందిన సుమారు 6 వేల ఎకరాల భూములను వేలానికి సిద్ధం చేశామని, వేలం ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఐడీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
అగ్రిగోల్డ్ సంస్థ మొత్తం రూ.6 వేల కోట్ల డిపాజిట్లు సేకరించగా, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచే రూ.3 వేల కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. బాధితుల వివరాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు, బాండ్ల పంపిణీ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి సెప్టెంబర్ 15లోగా బాండ్ల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెల 11న ప్రధాన కార్యదర్శితో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు, అలాగే ఆగస్టు 15లోగా అగ్రిగోల్డ్ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!