

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి నారాయణ అధికారుల బృందంతో కలిసి లండన్‌లో అధికారిక పర్యటనకు వెళ్లారు. అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు ఈ పర్యటన జరుగుతోంది. నార్మన్ అండ్ ఫోస్టర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, బ్యూరో హాపోల్డ్ కన్సల్టెన్సీ, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమై అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్ల బాహ్య రూపకల్పనపై చర్చించనున్నారు.
అసెంబ్లీ భవనం పై నిర్మించనున్న ఎత్తైన టవర్ డిజైన్ ఈ సమావేశంలో ముఖ్యాంశంగా నిలవనుంది. ఈ టవర్ ద్వారా అమరావతి నగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై ఆర్కిటెక్టులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటనలో సీఆర్డీయే కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్ అభిషేక్ కుమార్, చీఫ్ ఇంజినీర్లు కూడా పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!