
జనరల్

గ్రామాల్లో స్వచ్ఛ రథాలు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ రథాలపై అవగాహన కల్పించడంలో సహకరించిన నటుడు నానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల రికార్డు స్థాయిలో పొడి చెత్త సేకరణ జరగడంతో పాటు నిత్యావసరాలు అందించామని చెప్పారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!