

మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దక్షిణ భారతదేశంలో భారీ సోదాలకు శ్రీకారం చుట్టింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని సుమారు 30 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది. ఎనిమిది వేర్వేరు మాదకద్రవ్యాల కేసులకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యంలో భాగంగా సోదాలు జరుగుతున్నాయి.
ఎన్‌సీబీ చెన్నై జోనల్ యూనిట్ ఎన్‌డీపీఎస్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ పీఎంఎల్‌ఏ దర్యాప్తును ప్రారంభించింది. మెథాంఫెటమైన్ హైడ్రోక్లోరైడ్ అక్రమ వ్యాపారానికి సంబంధించిన కేసులో ఎం. అలెక్స్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారంతో ముడిపడిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ సంబంధాలను గుర్తించే దిశగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!