

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు మల్లేశ్ ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. శేషు, వినోద్, ప్రవీణ్, నిరంజన్, మల్లికార్జున్, బీర్బల్ షా, అవి దెయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మల్కాజిగిరి సీపీ సుమతి తెలిపారు. అరెస్టయిన వారిలో ఏ2 శేషు, ఏ3 వినోద్, ఏ4 ప్రవీణ్ ఆర్మీలో పనిచేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ కేసులో ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీపీ తెలిపారు. దొంగిలించిన ఆయుధాలతో బ్యాంకులు, నగల దుకాణాల్లో చోరీలు చేయడంతో పాటు సంపన్నులను బెదిరించి దోపిడీ చేయాలనే ఉద్దేశంతో నిందితులు కుట్ర చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఆయుధాల కోసం పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీర్బల్ షా, అవి దెయ్‌ను సంప్రదించినట్లు తెలిపారు. ఒక పిస్టల్‌కు రూ.3 లక్షలు, లాంగ్ వెపన్‌కు రూ.5 లక్షల చొప్పున ఒప్పందం కుదిరినట్లు సీపీ వివరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!