
రాజకీయాలు

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల తేదీలను అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి, మండలి కార్యదర్శి నరసింహాచార్యులు వేర్వేరు సర్క్యులర్లలో వెల్లడించారు. సమావేశాలు సెప్టెంబర్ 9 లేదా 10 వరకు కొనసాగే అవకాశం ఉంది.
ఈ సమావేశాల్లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం కీలక తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. సభల్లో ప్రశ్నలు అడగదలిచిన సభ్యులు సెప్టెంబర్ 2లోగా అసెంబ్లీ, మండలి కార్యదర్శులకు లిఖితపూర్వకంగా వివరాలు అందించాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!