
షోస్

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జిల్లా అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇస్తే, నిజామాబాద్‌కు జరుగుతున్న అన్యాయంపై వివరాలను వెల్లడించిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లాలోని ఎంఆర్‌ఓ, ఆర్‌డీఓ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని కోరుతున్నా స్పందన లేదని రాకేష్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్‌లో నిజాం కాలంలో నిర్మించిన ఎంఆర్‌ఓ కార్యాలయం ఇప్పటికీ కొనసాగుతోందని, సబ్ కలెక్టర్ కార్యాలయం పరిస్థితి కూడా సరిగా లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాకు నిధులు, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!