
జనరల్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసేందుకు ఆయన ఢిల్లీ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. ఉన్నత చదువుల కోసం ఈ నెల 21న మీనాక్షి నటరాజన్ లండన్ వెళ్లనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఇందుకు సంబంధించి ఆమె ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 18న తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి మీనాక్షి నటరాజన్ తప్పుకోనున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో ఈ నెలాఖరులోగా తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!