
జనరల్

నిద్రపోతూ లక్షలాది రూపాయల నగదు బహుమతిని గెలుచుకుని ముంబైకి చెందిన ఓ మహిళ వార్తల్లో నిలిచింది. ప్రముఖ సంస్థ వేక్‌ఫిట్ నిర్వహించిన ‘స్లీప్ ఇంటర్న్‌షిప్’ పోటీలో ఆమె విజేతగా నిలిచి రూ.9.6 లక్షల బహుమతిని సొంతం చేసుకుంది. ఈ పోటీకి దేశవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, వారిలో చివరకు పది మందిని ఎంపిక చేశారు.
ఎంపికైన అభ్యర్థులు అరవై రోజుల పాటు తమ నిద్ర అలవాట్లను పర్యవేక్షిస్తూ, ప్రతి వారం నిర్వహించిన వివిధ టాస్కుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అత్యుత్తమ నిద్ర స్కోరు సాధించిన ముంబై మహిళ విజేతగా నిలిచింది. నగదు బహుమతితో పాటు విహారయాత్రను కూడా గెలుచుకుంది. నిద్రకు ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించిన ఈ వినూత్న పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!