11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట

Writer: Pooja 03:14 PM, 11 సెప్టెంబర్, 2026
ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం రూ.620 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన కాంట్రాక్టర్లు, మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వెలుపల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. జల్‌ జీవన్‌ మిషన్‌ కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో 31 మార్చి 2026 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని వెల్లడించారు.

ఈ ఏడాది జూన్‌ 18న కాంట్రాక్టర్లతో జరిగిన సమావేశంలో పెండింగ్‌ చెల్లింపులను త్వరగా క్లియర్‌ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారని శ్రీనివాస్‌ తెలిపారు. అధికారుల నిరంతర కృషితో బిల్లుల చెల్లింపులు జరిగాయని చెప్పారు. అలాగే, నవంబర్‌ 2024 నుంచి 31 మార్చి 2026 వరకు రెట్రోఫిట్టింగ్‌ పనులకు సంబంధించిన రూ.647 కోట్ల బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించిందన్నారు. స్పర్శ పథకం కింద సుమారు రూ.138 కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటివరకు సుమారు రూ.70 కోట్లు చెల్లించారని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులతో ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు ఆర్థిక ఉపశమనం లభించిందని అసోసియేషన్‌ పేర్కొంది. ఇకపై నెలనెలా నిర్దిష్ట విధానంలో చెల్లింపులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్‌ కీలక సూచనలు

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్‌ కీలక సూచనలు

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లుపెండింగ్ బిల్లులుజల్ జీవన్ మిషన్పవన్ కల్యాణ్చంద్రబాబు నాయుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు
బిజినెస్

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్
జనరల్

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?
జనరల్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన
జనరల్

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్‌ కీలక సూచనలు
జనరల్

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్‌ కీలక సూచనలు

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట
జనరల్

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు
జనరల్

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా
సినిమాలు

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ
జనరల్

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!