

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ వరకు అతడిని జట్టులో కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోచ్, సెలక్టర్ల భవిష్యత్ ప్రణాళికల్లో రోహిత్‌కు చోటు ఉండకపోవచ్చంటూ గతంలో వార్తలు వచ్చినప్పటికీ.. బీసీసీఐ మాత్రం అతడి ఫామ్‌పై నమ్మకం వ్యక్తం చేసింది. రోహిత్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.
అయితే 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఆడతాడా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అంశంపై ప్రశ్నించగా.. “అక్టోబర్ 2027 ఇంకా చాలా దూరం ఉంది.. అప్పటివరకు చూద్దాం” అని రోహిత్ సమాధానమిచ్చాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఇంకా పలు వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉండటంతో.. రోహిత్ ఫామ్, ఫిట్‌నెస్, ప్రదర్శనల ఆధారంగానే అతడి భవిష్యత్తుపై నిర్ణయం ఉండే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!