

రకుల్ ప్రీత్ సింగ్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రెండు భాగాల రామాయణం సినిమాలో శూర్పణఖ పాత్రలో నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, కాజల్ మండోదరిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం అంతర్జాతీయంగా నవంబర్ 6, 2026న, భారత్‌లో దీపావళి సందర్భంగా నవంబర్ 8న విడుదల కానుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ తన మనసులోని కోరికలను వెల్లడించారు. ఇప్పటివరకు పూర్తి స్థాయి భావోద్వేగభరితమైన రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించలేదని, అలాంటి ఇంటెన్స్ ప్రేమకథ చేయాలని ఉందని చెప్పారు. అలాగే పీరియడ్ ఫిలిం, హర్రర్ జానర్‌లలోనూ నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై సినిమా ఎంత పెద్దది, ఏ జానర్ అనేది కాకుండా తన నటనకు పూర్తిస్థాయిలో అవకాశం ఇచ్చే బలమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని రకుల్ స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!