

జియో హాట్‌స్టార్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తాజా వెబ్ సిరీస్ ‘హుంక్కార్: ది రోర్’. పోలీస్ దర్యాప్తు, కోర్టు విచారణ, మీడియా ప్రపంచం చుట్టూ సాగే ఈ డ్రామాలో అనీత్ పడ్డా, ఫాతిమా సనా షేక్, మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్, అర్జున్ మాథుర్, రఘుబీర్ యాదవ్, రామ్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిత్యా మెహ్రా, కరణ్ డి కపాడియా, హీరాజ్ మార్ఫాటియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను బిర్లా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రియాంక చోప్రా జోనాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 25, 2026 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. నిర్మాతగా తాను సమాజానికి మంచి సందేశాన్ని అందించే కథలను ఎప్పుడూ ప్రోత్సహిస్తానని తెలిపారు. ‘హుంక్కార్: ది రోర్’ కూడా అలాంటి బలమైన కథేనని అన్నారు. స్పష్టమైన ఆలోచనలు, ప్రత్యేకమైన విజన్ ఉన్న దర్శకులకు పూర్తి సృజనాత్మక స్వేచ్ఛ ఇవ్వడం తమ ‘పర్పుల్ పెబుల్ పిక్చర్స్’ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం పట్ల గర్వంగా ఉందని, ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని ప్రియాంక తెలిపారు. ఈ కథ తనను ఎంతగానో కదిలించిందని, ప్రేక్షకులపై కూడా అదే స్థాయిలో ప్రభావం చూపుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!