
జనరల్

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కొండా సురేఖకు ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆమెను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీలో చురుగ్గా ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఇన్‌చార్జి ఆమెతో మాట్లాడినట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్ సూచనల నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!