

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు ఈరోజు నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని అమ్మవారి ఆలయాలకు తరలివెళ్లనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ, బోనాలు తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని 3,000కు పైగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఉత్సవాల కోసం రూ.20 కోట్లు కేటాయించినట్లు సీఎం గుర్తు చేశారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్ 2026 అధికారిక విందులో పాల్గొని పలు దేశాల మంత్రులతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!