
జనరల్

అమెరికాలోని మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో అమెజాన్ ప్రైమ్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 767-300 కార్గో విమానం రన్‌వేపై అదుపుతప్పి బయటకు దూసుకెళ్లింది. అనంతరం పలు వాహనాలను ఢీకొని మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 60కి పైగా అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. విమానంలోని పైలట్, కో-పైలట్‌ను రక్షించడంతో పాటు, విమానం ఢీకొన్న వాహనాల్లో చిక్కుకున్న వారిని కూడా సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు ప్రారంభించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!