

తెలంగాణ ఆటో కార్మిక సంఘాలతో నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, అగ్రిగేటర్ పాలసీపై యూనియన్ల ప్రతిపాదనలు, మీటర్ ఛార్జీల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
డీజిల్, పెట్రోల్ ఆటోలకు రీట్రోఫిట్టింగ్ కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందించే అంశంపైనా సమావేశంలో చర్చించనున్నారు. ఈ సహాయానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. గత నెల 23న ఆటో యూనియన్ల జేఏసీ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఉన్నతాధికారులకు, జేఏసీ ప్రతినిధులను ఆహ్వానించాలని రవాణా శాఖ కమిషనర్‌కు సూచించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!