
రాజకీయాలు

విజయవాడలోని ఎంజీ రోడ్డులో ఉన్న పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని విజయవాడకు తీసుకొచ్చిన పోలీసు అధికారులు ప్రజల సందర్శనార్థం ఉంచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బాలసుబ్రహ్మణ్యం పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో ఈ-ప్రగతి, ఆర్టీజీఎస్ వంటి ముఖ్యమైన వ్యవస్థల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఆయన అందించిన సేవలను పలువురు గుర్తుచేసుకుంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!