

గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే ముందుకు వెళ్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల అనంతరం, బుధవారం నిర్వహించిన జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని ప్రతిపాదించారు. అయితే, సంబంధిత రాష్ట్రాల అంగీకారం లేకుండా నిర్ణయం తీసుకోబోమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరికి చెరో 45 టీఎంసీలు, కర్ణాటకకు 16 టీఎంసీలు కేటాయించే ప్రతిపాదనపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేయగా, తమిళనాడు, పుదుచ్చేరి ఈ ప్రాజెక్టుకు మద్దతు తెలిపాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!