
సినిమాలు

చక్కెర ధరలను నియంత్రించడంతో పాటు మార్కెట్‌లో కృత్రిమ కొరతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15, 2026 నుంచి చక్కెర వ్యాపారులు, డీలర్లు, హోల్‌సేలర్లకు వర్తించే స్టాక్ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుంచి 2,000 క్వింటాళ్లకు తగ్గించింది. ఈ కొత్త పరిమితి నవంబర్ 30, 2026 వరకు అమల్లో ఉంటుంది.
అయితే కోల్‌కతా, దాని విస్తరించిన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 4,000 క్వింటాళ్ల స్టాక్ పరిమితి కొనసాగుతుంది. అలాగే కొనుగోలు చేసిన చక్కెర స్టాక్‌ను 30 రోజులకు మించి నిల్వ ఉంచడాన్ని కేంద్రం నిషేధించింది. ధరల స్థిరీకరణ, సరఫరా నిరంతరంగా కొనసాగడం, అధిక నిల్వల ద్వారా ధరలపై ప్రభావం పడకుండా చూడడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!