

బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో ఉంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అంటే సామాన్యుడిగా భావిస్తూ ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుని పనిచేస్తున్నానని చెప్పారు. పేదలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సంక్షేమంతో పాటు పీ4 వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత పాలకులు రాష్ట్ర వ్యవస్థలను దెబ్బతీశారని, ఆర్థిక ఇబ్బందులు సృష్టించారని ఆయన ఆరోపించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని, కేంద్రం-రాష్ట్రంలో సమన్వయంతో పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!