
సినిమాలు

ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో (జీటీఏ) 6 విడుదల నేపథ్యంలో ఓ ప్రైవేటు సంస్థ వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు కొత్త గేమ్‌ను ఆస్వాదించేందుకు వీలుగా వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. చెన్నైకి చెందిన ఇంటీరియర్ డిజైన్ సంస్థ ‘ఇండె బై ఛైర్స్ కార్టే’ తమ ఉద్యోగులు, ఇంటర్న్లు, ఫ్రీలాన్సర్లందరికీ గురువారం అధికారికంగా సెలవు ఇచ్చింది.
ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ కిషోర్ షణ్ముగం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. జీటీఏ 6 విడుదల సందర్భంగా ఉద్యోగులు గేమ్ ఆడుతూ సమయం గడిపేందుకు ఈ సెలవు ప్రకటించినట్లు తెలిపారు. గేమింగ్ అభిమానుల్లో ఈ గేమ్‌పై ఉన్న క్రేజ్‌కు ఈ నిర్ణయం నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచంలోని మరికొన్ని సంస్థలు కూడా ఇదే కారణంతో తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!