
సినిమాలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యూకే–అమెరికా పర్యటనలో భాగంగా గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
ఢిల్లీ విమానాశ్రయంలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు డా. మల్లు రవి, తెలంగాణ ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి ఆయన యూకే–అమెరికా పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!