
గాసిప్స్

జాతీయ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు సత్తా చాటారు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణకు చెందిన క్రీడాకారులు మొత్తం నాలుగు పతకాలు సాధించారు. సుహాస్ ప్రీతం 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకంతో మెరిశాడు. నిత్యం 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో రజత పతకం, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో కాంస్య పతకం సాధించింది.
అన్నిక 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ముగ్గురు క్రీడాకారులు గచ్చిబౌలి శాట్ స్విమ్మింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు సాధించడం పట్ల క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులోనూ వీరు మరిన్ని విజయాలు సాధిస్తారని నిర్వాహకులు, కోచ్‌లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!