
సినిమాలు

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, అదే అంశంపై మంత్రి కొండా సురేఖ నుంచి వివరణ కూడా కోరినట్లు చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.
పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయిస్తుందని మహేశ్ గౌడ్ తెలిపారు. పార్టీ విధానాలు, నిర్ణయాలకు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. పార్టీ లైన్‌కు కట్టుబడి పనిచేయడం ప్రతి నాయకుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!