
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంప్ డేవిడ్‌లో ఉన్న సమయంలో, మేరీల్యాండ్‌లోని థర్మాంట్ ప్రాంతంలో అమల్లో ఉన్న తాత్కాలిక విమాన పరిమితి ప్రాంతంలోకి ఓ పౌర విమానం ప్రవేశించింది. సెప్టెంబర్ 19న ఉదయం సుమారు 7:50 గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా, నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ( నారాడ్)కు చెందిన F-16 ఫైటర్ జెట్ రంగంలోకి దిగింది
విమానాన్ని అడ్డుకునే సమయంలో ఎఫ్-16 ఫ్లేర్‌లను ప్రయోగించి పైలట్ దృష్టిని ఆకర్షించింది. అనంతరం ఆ పౌర విమానాన్ని సురక్షితంగా పరిమిత ప్రాంతం వెలుపలకు ఎస్కార్ట్ చేసినట్లు నారాడ్ వెల్లడించింది. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు థర్మాంట్ ప్రాంతంలో తాత్కాలిక విమాన పరిమితులు అమల్లో ఉంటాయని అధికారులు ముందుగానే ప్రకటించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!