

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు దరఖాస్తుల సమర్పణ గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ముందుగా నవంబర్ 6 వరకు మాత్రమే అవకాశం ఉండగా, ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 25న పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించనున్నారు.
గత రెండు రోజులుగా ఓటరు నమోదు కోసం ఉపయోగించే సీఈవో అధికారిక పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పట్టభద్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియకు అంతరాయం కలగడంతో దరఖాస్తుల సమర్పణకు అదనపు సమయం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే సాంకేతిక సమస్యలను పరిష్కరించి పోర్టల్‌లోని అన్ని సేవలను పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు హక్కు నమోదు చేసుకునే అవకాశాన్ని కోల్పోకుండా ఉండేందుకే గడువు పొడిగించినట్లు వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!